వంద పడకల ఆసుపత్రి లక్ష్యం
ELR: చింతలపూడి పట్టణంలోని ఏరియా ఆసుపత్రి వద్ద బుధవారం వైద్యులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ.. వంద పడకల ఆసుపత్రి నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. వైద్యులు సహనంతో సామాన్యులకు సేవలు అందించాలని ఆయన అన్నారు. వైద్యులకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.