సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్
ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల తదితర అధికారులు పాల్గొని ప్రజల ఫిర్యాదులను పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.