అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా జన్ను రవి
MLG: అంబేద్కర్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో జిల్లా అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా జన్ను రవి నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్‌ను కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే, శాలువాతో సత్కరించారు. ఈ నెల 14న జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్సీ అధికారి కొమురయ్యను కమిటీ సభ్యులు సత్కరించారు.