పెద్దఆవుటపల్లిలో 'తల్లిపాల వారోత్సవాలు'

పెద్దఆవుటపల్లిలో 'తల్లిపాల వారోత్సవాలు'

కృష్ణా: ఉంగుటూరు మండలంలోని పెద్దఆవుటపల్లి సెక్టార్‌లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. పుట్టిన బిడ్డకు ముర్రిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని, రెండు ఏళ్ళ వరకూ తల్లిపాలే శ్రేష్ఠమని ఐసీడీఎస్ సూపర్వైజర్ బీ.పద్మాదేవి సూచించారు. శుభ్రత పాటించితే అనారోగ్య సమస్యలు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, తల్లులు పాల్గొన్నారు.