అహోబిలం క్షేత్రంలో తప్పిన పెనుముప్పు

AP: నంద్యాల జిల్లాలోని ఎగువ అహోబిలం క్షేత్రంలో పెనుముప్పు తప్పింది. మెట్ల మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా కరెంట్ స్తంభం పడిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అయితే అక్కడ భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.