ప్రజాపాలన అప్లికేషన్స్ మాయం.. కలెక్టర్‌కు ఫిర్యాదు
NLG: కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులు అదృశ్యం అవ్వడం కలకలం రేపుతోంది. అర్వు అన్నారం గ్రామానికి చెందిన ఓ మహిళా ప్రజాపాలన పథకాల లబ్ది కోసం దరఖాస్తు చేసుకుంది. ఆన్‌లైన్ రశీదు ఉన్నా ఫైల్ మాత్రం కనిపించలేకపోవడంతో బాధితురాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఉన్నత అధికారులను విచారణకు ఆదేశించారు. రికార్డులు మాయం అవ్వడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.