పాడేరు డీఎఫ్‌వో సందీప్ రెడ్డి బదిలీ

పాడేరు డీఎఫ్‌వో సందీప్ రెడ్డి బదిలీ

ASR: పాడేరు జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్‌వో) పీవీ సందీప్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను ఏలూరు డీఎఫ్‌వోగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన సందీప్ రెడ్డి 2024 నుంచి పాడేరు డీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్నారు. అటవీ అభివృద్ధి, అక్రమ కలప రవాణా నియంత్రణకు కృషి చేశారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు.