శబ్దాలతో హార్న్‌లను మోగిస్తే సీజ్ చేస్తాం: ఎస్సై
కృష్ణా: గుడివాడ మండలం మోటూరు క్రాస్ రోడ్డులో ఎస్సై చంటిబాబు బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై పరిమితికి మించి అత్యధిక శబ్దంతో హార్న్‌లను మోగించి ఇతర వాహనదారులకు, పేషంటులకు పర్యావరణానికి అసౌకర్యం కలిగిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్సై చంటిబాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.