గుడివాడ గురునాథరావుకు ఘన నివాళి
VSP: మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు 24వ వర్ధంతి సందర్భంగా విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్న జానకిరామ్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు బోని శివరామకృష్ణ, మెరుగణేష్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.