విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన..!
SKLM: నరసన్నపేటలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఇవాళ పోలీస్ శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోక్సో చట్టం, మహిళా, బాలికా సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. మత్తు పానీయాల వల్ల కలిగే అనర్ధాలు, గంజాయి, కైని, గుట్కా మాదకద్రవ్యాలు వినియోగం, రవాణాపై ఉన్న నిషేధాలు, పోలీస్ చట్టాలు విద్యార్థులకు తెలియజేశారు.