అన్నిరంగాల్లో మహిళలు ఉన్నతంగా ఎదగాలి: ఎస్పీ సునీత రెడ్డి

అన్నిరంగాల్లో మహిళలు ఉన్నతంగా ఎదగాలి: ఎస్పీ సునీత రెడ్డి

వనపర్తి: మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని ఎస్పీ సునీత రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని తన ఛాంబర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు. మహిళలకు గౌరవం, సమాన హక్కులు, అవకాశాలు లభించినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధిని సాధించగలదని అన్నారు. ప్రతి మహిళ ధైర్యంగా ముందుకు సాగుతూ తన లక్ష్యాలను సాధించాలన్నారు.