ఎస్సీ కార్యాచరణ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం
సూర్యాపేట జిల్లాలో ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక (2025-26) రెండో విడత కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన వారు ఏప్రిల్ 2లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ సూచించారు. వ్యవసాయ, ఉపాధి పథకాలకు 60 నుంచి 90 శాతం సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఆసక్తి గలవారు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.