రైలు ప్రమాదంలో ASI మృతి
SKLM: పలాసలో విషాద ఘటన జరిగింది. రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఏఎస్సై భగాతి హిమంత్ రావు రైల్వే ట్రాక్ దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పలాస రైల్వే స్టేషన్ పరిధిలోని బెండిగేటు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.