‘అంతరిక్షం నుంచి భారత్ అందంగా కనిపిస్తుంది’

‘అంతరిక్షం నుంచి భారత్ అందంగా కనిపిస్తుంది’

అంతరిక్షం నుంచి భారతదేశం అందంగా కనిపిస్తుందని గగన్‌యాన్ వ్యోమగామి శుభాంశు శుక్లా పేర్కొన్నారు. అంతరిక్ష కేంద్రంలో రికార్డు చేసిన వీడియో గురించి చెప్పారు. రాత్రిపూట హిందూ మహాసముద్రం నుంచి భారతదేశం మీదుగా వెళ్తుంటే, అది జీవితంలో చూడగలిగే అత్యంత అందమైన దృశ్యాలలో ఒకటి అని తెలిపారు. అంతరిక్షంలో భారత్ ప్రత్యేకమైన స్థానంలో, ఆకారంలో కనిపిస్తుందని ఆయన అన్నారు.