తిరుమలలో మహిళలే టార్గెట్‌గా ఘరానా మోసం

తిరుమలలో మహిళలే టార్గెట్‌గా ఘరానా మోసం

AP: తిరుమలలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. మాంగళ్య పూజ పేరుతో తమిళనాడుకు చెందిన మురుగన్ అనే ఘరానా మోసగాడు మహిళలను టార్గెట్ చేసేవాడు. ఇటీవల TTD ఉద్యోగినంటూ నమ్మించి ముగ్గురు మహిళల నుంచి రూ.13 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కాజేయడంతో ఈ విషయం బయటకువచ్చింది. మహిళల ఫిర్యాదుతో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. గత 35 ఏళ్లుగా ఇలాంటి మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.