'విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం'

'విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం'

KMM: విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ అన్నారు. మంగళవారం మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ హాస్టల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పారు. అలాగే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ ఫీజు రియంబర్స్‌మెంట్ వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు.