'ఇందిరమ్మ ఇల్లు సకాలంలో నిర్మించుకోవాలి'
KMR: బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో నిర్మించుకోవాలని సర్పంచ్ కోడూరి సాయ గౌడ్ చెప్పారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.