ప్రధాని మోదీని కలిసిన బాపట్ల ఎంపీ

ప్రధాని మోదీని కలిసిన బాపట్ల ఎంపీ

బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని ప్రధానిని కోరారు.