బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం

బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం

RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం మేలగూడ తండాలో మహిళా శిశు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో 'బేటి బచావో-బేటి పడావో' కార్యక్రమాన్ని నిర్వహించారు. 8-10వ తరగతి విద్యార్థినిలకు అమ్మాయిల విద్యాభద్రత, హక్కులు, అభివృద్ధి, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించారు. బాల్య వివాహానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే అధికారులకు లేదా 1098కు ఫోన్ చేయాలని సూచించారు.