రావికమతంలో శరవేగంగా పూడికతీత

రావికమతంలో శరవేగంగా పూడికతీత

అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రంలో బుధవారం ఎడతెరపిగా కురిసిన వర్షాలకు కాలువలో నీరు రోడ్లపై నుంచి ప్రవహించాయి. వాహన చోదకులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. స్థానిక పంచాయతీ కార్యదర్శి కృష్ణమోహన్ వెంటనే స్పందించారు. వాహన చోదకులు ఇబ్బందులను గ్రహించి కాలవలో పూడుకను, JCBతో తీయించారు. కృష్ణమోహన్ స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.