సచివాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు

TG: సచివాలయాన్ని బీజేపీ నేతలు ముట్టడించారు. హైదరాబాద్‌లో మౌలిక వసతులు కల్పించాలని.. 'సేవ్ హైదరాబాద్' పేరుతో ముట్టడించారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీసు వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు.