నేటి నుంచి శిలాతీర్థ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
NZB: జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండలోని శిలాతీర్థ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. కొండ గుహ నుంచి నిరంతరం వచ్చే సహజ సిద్ధమైన జలమే ఇక్కడి ప్రత్యేకత. ఈ నీటినే భక్తులకు తీర్థంగా అందజేస్తారు. నేడు అంకురార్పణతో మొదలై, 24న ధ్వజారోహణం, 26న స్వామి వారి కళ్యాణోత్సవం, 27న రథోత్సవం నిర్వహించనున్నారు.