VIDEO: బాల వికాస జలదానం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందగ్రామంలో బాల వికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జలదానం కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజలకు చల్లని త్రాగునీరు అందుబాటులో ఉండేలా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేయాలన్నారు.