ప్రబుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం: కలెక్టర్
PPM: నిత్యం ప్రజా సేవలో ఉండే అధికారులు, ఉద్యోగులకు ఆరోగ్యం కూడా ముఖ్యమని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అధికారులు పనుల ఒత్తిడిలో తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరని, అందుకోసమే ఉచిత వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు