సీసీ రోడ్డు పనులు పరిశీలించిన కార్పొరేటర్

RR: హయత్ నగర్ డివిజన్‌లోని రామకృష్ణనగర్‌లో జరుగుతున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఏఈ హేము నాయక్‌కు సూచించారు. అనంతరం కార్పొరేటర్ కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.