బస్తి దవాఖానను తనిఖి చేసిన కలెక్టర్

SDPT: సిద్దిపేట అర్బన్ మండలం కేసీఆర్ నగర్‌లోని బస్తి దవాఖానను కలెక్టర్ హైమావతి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. అటెండెన్స్, ఓపీ రిజిస్టర్, లీవ్ లెటర్లు వెరిఫై చేశారు. మెడిసిన్ అందుబాటులో ఉందా, సీజనల్ వ్యాధులకు సంబంధించి అన్ని పరికరాలు ఉన్నాయాని ఆరా తీశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు.