VIDEO: చెరువులు, కుంటలు కాపాడాలని కలెక్టర్ కు వినతి
MBNR: అర్బన్ మండలంలోని చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తాకు ప్రజావాణిలో ఆయన ఫిర్యాదు చేశారు. తక్షణమే కబ్జాలను అడ్డుకొని వాటికి హద్దులను ఏర్పాటు చేయాలని కోరారు. కబ్జాల కొరనుంచి పాలమూరును పరిరక్షించాలని ఆయన పేర్కొన్నారు.