'మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత'
TPT: మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నెహ్రూ యువజన సేవా సంఘం అధ్యక్షులు జ్యోతి లక్ష్మి పేర్కొన్నాను. ఆదివారం వడమాలపేట మండలం ఎస్‌వీ.పురంలో నెహ్రూ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో అంజెరమ్మ గుడి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మురళీ, వెంకమరాజు, తులసి, నాదముని, రమణరాజు, చిరంజీవి పాల్గొన్నారు.