ఎస్పీ ఆదేశాలతో రోడ్డు భద్రతపై శక్తి టీమ్ అవగాహన
BPT: ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ శక్తి టీమ్ వేటపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు రోడ్డు భద్రతా నియమాలపై ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఎంతో అవసరమని పోలీసులు వివరించారు. క్రమశిక్షణతో కూడిన ప్రయాణం ప్రాణాలకు రక్షణనిస్తుందని పేర్కొన్నారు.