చెరువులో యువకుడి మృతదేహం లభ్యం
RR: చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన ఫరూఖ్ నగర్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కిషన్ నగర్ గ్రామ శివారులోని చెరువులో ఓ యువకుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. ఈత కోసం చెరువు వద్దకు వెళ్లి నీటిలో మునిగిపోయి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.