మహిళా స్వయం ఉపాధితోనే ఆర్థికాభివృద్ధి : సర్పంచ్

మహిళా స్వయం ఉపాధితోనే ఆర్థికాభివృద్ధి : సర్పంచ్

SRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మునగాల మండలం నరసింహపురం గ్రామంలో ఆదివారం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సర్పంచ్ వేమూరి సత్యనారాయణ ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి స్వయం ఉపాధి ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం మహిళలు ఘనంగా సన్మానించారు.