VIDEO: 'నడి రోడ్డుపై ధర్నా చేసినట్లు కూర్చున్న కోతులు'
WGL: గీసుగొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఇవాళ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో వానరాలు నడిరోడ్డుపై కూర్చొని గంటల తరబడి రాకపోకలకు అడ్డంకిగా మారాయి. వాహనదారులు హారన్ కొట్టినా, గెంటినా కదలకుండా “ధర్నా” చేసినట్లు కూర్చున్నాయి. చివరికి స్థానికులు భయపెట్టి పంపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోతుల సమస్యే ప్రధాన ఎజెండాగా మారనుందని ప్రజలు అంటున్నారు.