CID హోంగార్డ్స్ ఉద్యోగాల పరీక్షలు ప్రారంభం

GNTR: అమరావతి ప్రాంతంలోని VIT యూనివర్సిటీలో ఆదివారం CID విభాగానికి చెందిన హోంగార్డ్స్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు నేటి నుంచి జరుగుతున్నాయి. 28 హోంగార్డు పోస్టుల భర్తీకి 12,569 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 5,567 మందిని కంప్యూటర్ పరీక్షకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.