నేడు క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ సెంటర్ ప్రారంభం

నేడు క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ సెంటర్ ప్రారంభం

AP: రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి మరో ముందడుగు పడనుంది. అమరావతిలోని SRM విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 'క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ సెంటర్'ను సీఎం చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నారు. అత్యాధునిక పరిశోధనలకు వేదికగా నిలవనున్న ఈ కేంద్రం, రాష్ట్ర ఐటీ మరియు సాంకేతిక రంగంలో కీలక పాత్ర పోషించనుంది.