సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్
BDK: చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పంచాయతీలోని బాలికుంట గ్రామంలో సుమారు రూ. 5 లక్షల నిధులతో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ లలిత సోమవారం ప్రారంభించారు. కుంచపు కన్నయ్య ఇంటి నుంచి నర్రా నాగమణి ఇంటి వరకు రోడ్డు వేయడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. ఉప సర్పంచ్ బాలు, స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.