మన వరంగల్‌లో ఎన్నో చారిత్రక కట్టడాలు

మన వరంగల్‌లో ఎన్నో చారిత్రక కట్టడాలు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వేయి స్తంభాల గుడి, కాకతీయ కళా తోరణం, ఖిలా వరంగల్, కోటలు, పలు గ్రామాల్లో వారు నిర్మించిన శివాలయాలు, ఇతర దేవాలయాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాగా, నేడు అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం.