'మక్కా బస్సు ప్రమాదం బాధాకరం'
KDP: మక్కా-మదీనా యాత్రలో తెలంగాణకు చెందిన 42 మంది ముస్లింలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై YCP రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి బయలుదేరిన భక్తులు ఇలాంటి విషాదానికి గురవడం దురదృష్టకరమని, ఒకే కుటుంబం నుంచి 18 మంది మరణించడం హృదయవిదారకమన్నారు.