VIDEO: గిరిజన విద్యార్థుల పట్ల పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం
ASR: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల పట్ల, పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆర్టీఐ జిల్లా కో-ఆర్డినేటర్ అర్జున్ రెడ్డి శుక్రవారం ఆరోపించారు. ఇందులో భాగంగానే ఇటీవల రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థులకు విద్యా బుద్ధులు, నాణ్యమైన మెనూ అందించడం లేదన్నారు.