వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

BDK: భద్రాద్రి రామయ్య వారి దేవస్థానంలో నిత్య కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలను తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో సీతారామ లక్ష్మణులను కొలువుదీర్చి, వేద మంత్రోచ్చారణల మధ్య నిత్య కళ్యాణాన్ని జరిపారు.