'గణేష్ మండపాల వద్ద పేకాట ఆడితే చర్యలు'

ADB: గణపతి మండపాల వద్ద పేకాట ఆడిన, కేటీ తీసిన, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. జిల్లాలో రెండు రోజుల్లో మూడు కేసుల్లో పట్టణంలో 20 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మూడు కేసుల్లో పేకాట ముక్కలు,13 మొబైల్ ఫోన్లు, ఒక కారు, ఐదు మోటర్ సైకిల్లు,రూ 82,120 /- నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు.