భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

GDWL: పుల్లూరుకి చెందిన రాజారెడ్డి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు బుధవారం గ్రామానికి చేరుకుని రాజారెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.