మార్బుల్స్ దింపుతుండగా దుర్ఘటన.. ఓ వ్యక్తి మృతి
MHBD: గార్ల మండలం పుల్లూరు పంచాయతీ పరిధిలోని బంగ్లాతండాలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇందిరమ్మ గృహానికి తీసుకువచ్చిన మార్బుల్స్‌ను దింపుతున్న సమయంలో బోడా తరుణ్ (25) అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై సీఐ రవీందర్ విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.