ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

జార్ఖండ్ హజరీబాగ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనాయకుడు సహదేవ్ సోరెన్ సహా మరో ఇద్దరు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. కాగా గతంలో సహదేవ్ సోరెన్ తలపై రూ.కోటి రివార్డ్‌ను ప్రభుత్వం ప్రకటించింది.