గృహ జాబితా బ్లాకుల సృష్టిపై జిల్లా కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి జిల్లాలో జనగణన ప్రక్రియలో భాగంగా గృహ జాబితా బ్లాకుల సృష్టి పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బ్లాకుల తయారీలో ఖచ్చితత్వం పాటించాలని, ఎన్యూమరేటర్లు పని సమానంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి లోపాలు లేకుండా పనులను వేగవంతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ ఉన్నారు