జిల్లాకు సరిపడా యూరియా కేటాయించండి: ఎమ్మేల్యే

జిల్లాకు సరిపడా యూరియా కేటాయించండి: ఎమ్మేల్యే

GDWL: జిల్లాకు సరిపడా యూరియాను కేటాయించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పలు పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు గట్టు మాజీ ఎంపీపీ విజయ్ తెలిపారు.