ఇంటర్వ్యూలకు 348 మంది అభ్యర్థులు హాజరు

ASR: నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు ఎస్పీ ధీరజ్ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు శుక్రవారం పాడేరులో ఇంటర్వ్యూలు నిర్వహించారు. పాడేరు డివిజన్ నుంచి 348మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 280మంది ఎంపికయ్యారు. ఎంపికైనవారికి రెండు నెలలు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.