కొలిమిగుండ్లలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు జాతీయ గీతాన్ని పాడి పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరించారు.