గుడుంబా స్థావరాలపై దాడులు

SRCL: వీర్నపల్లి మండలంలోని గుడుంబా స్థావరాలపై ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ దాడులు నిర్వహించారు. రంగంపేట, గర్జనపల్లి, ఎర్రగడ్డ తండాలలో గుడుంబా స్థావరాలపై దాడులు చేయగా 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని,150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. సారా తయారీకి బాధ్యులైన ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.