'ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలి'

చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో కొంగారెడ్డిపల్లెలో శనివారం ఏర్పాటు చేసిన "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చి, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. పలువురికి క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నరసింహ ప్రసాద్ పాల్గొన్నారు.