భారీ వర్షాలకు రహదారికి భారీ గండి

MDK: శివంపేట మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాంబండ–పోతులబోగూడ ప్రధాన రహదారి వద్ద కల్వర్టు ప్రాంతంలో రోడ్డు కొట్టుకుపోయింది. రహదారి పూర్తిగా తెగిపోయి భారీ గండి ఏర్పడింది. పరిస్థితిని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రాధ మల్లేష్ గౌడ్, కేంద్ర ప్రభుత్వం నుంచి రోడ్డునకు ఇప్పటికే నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.